నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు.
ఏపీలో మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం అగుపించింది. పర్వదిన వేళ రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకొని భక్తులను ఆశ్చర్యపరిచాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో
చంద్రబాబును ఎదుర్కోలేక, అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక.. బాలకృష్ణను తాగుబోతు అని జగన్ విమర్శలు చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు.
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బుధవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.