Aabdul Aziz: వక్ఫ్ బోర్డు ఆస్తుల విక్రయంపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్తుల వివరాలను ఆయన వివరించారు. రంజాన్ మాసంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం తెలంగాణకు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారు.
Illegal Mining Case: నెల్లూరు క్వార్ట్జ్ అక్రమాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రభాకర్ రెడ్డి.. న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.
Kakani Skipping Police Inquiry: పోలీసుల విచారణకు సహకరించకుండా హైడ్రామాకు తెరలేపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు మాజీ మంత్రి గైర్హాజరయ్యారు.
అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా హైడ్రామాకు తెరతీశారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. కాగా అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి.
Kakani Investigation News: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి.
Kakani Police Notice: కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి విచారణకు రాకపోతే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు ఆదివారం నాడు వెళ్లారు. అయితే ఇంట్లో కాకణి లేకపోయే సరికి అతని కోసం అన్వేషణ చేస్తున్నారు.