Home » Andhra Pradesh » Guntur
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే విషయంలో రాజీపడే ప్రశస్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీలో ఎండలు వేసవిని తలపిస్తూ విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని అన్నారు. ఏపీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును గతంలో నిర్బంధించిన రోజులను గుర్తుచేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ అధికారులు ఫైనల్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయస్థానానికి రెండు రోజుల క్రితం సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగనుంది. జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బుధవారం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.