ఏపీకి వర్ష సూచన.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:50 PM
రాగల మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
అమరావతి, సెప్టెంబర్ 18: రాగల మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని దృష్ట్యా ఆయా జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.
Also Read:
ఈగల్ టీమ్ పటిష్ఠ నిఘాతోనే క్రైమ్ రేట్ తగ్గింది: హోం మంత్రి అనిత
అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్