రెయిన్ అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:43 PM
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురవనున్నట్లు హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉరుములతో కూడిన వర్షాల నేపథ్యంలో పొలాల్లో పని చేసే రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందనీ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఈరోజు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేందుకు యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి