పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:54 PM
కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుకు గడ్డి మందు తాపాడు. ఆపై తను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
అమరావతి, ఏప్రిల్ 19: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుకు గడ్డి మందు తాపాడు. ఆపై తను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. భార్యకాపురానికి రావటం లేదన్న బాధతో ఆ వ్యక్తి ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బొల్లాపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన చిన్నా అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన బుజ్జి అనే మహిళతో 7 ఏళ్ల క్రితం పెళ్లయింది.
ఈ దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనస్పర్థల నేపథ్యంలో బుజ్జి పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నా ఎంత బ్రతిమలాడినా ఆమె మాత్రం కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి కుమారుడికి ఇచ్చాడు. తర్వాత తను కూడా పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు తండ్రీకొడుకులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ 3 రోజుల భారత పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం
మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి: మోదీ పిలుపు