Share News

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:59 PM

హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
Prakash Raj controversy

అమరావతి, ఏప్రిల్ 19: హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోట్లాది మంది ఆరాధించే హిందూ దేవుళ్ల గురించి అవమానకరంగా మాట్లాడి.. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందన్నారు. హిందూ మతం, సంస్కృతి, దేవాలయాలపై ప్రకాశ్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం మొదటి సారి కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు ఉన్నప్పటికీ, అది ఎవరి విశ్వాసాలను అవమానించేలా ఉండకూడదని చెప్పారు. ప్రకాశ్ రాజ్ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


ఇంతకీ ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

రెండు రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ.. ‘రామలక్ష్మణులు ఉత్తరభారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు. ఉత్తర భారతదేశానికి చెందిన రామలక్ష్మణులు.. దక్షిణాదికి చెందిన రావణుడి పొలంలో పళ్లను దొంగతనం చేశారు. ఇది చూసిన శూర్పణఖ జీఎస్టీతో సహా డబ్బులు కట్టమని అడిగింది. ఈ కారణంతోనే యుద్ధం మొదలైంది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.


100 కోట్లకు ప్రకాశ్‌పై దావా..

టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్ రాజ్‌పై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. భాను ప్రకాశ్ తరఫు న్యాయవాది.. ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

మా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు: ఇరాన్ అధ్యక్షుడు

నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్

Updated Date - Apr 19 , 2026 | 05:17 PM