తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:14 AM
ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.
హైదరాబాద్, ఆగస్టు 11: ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం వెల్లడించింది. రుతుపవన ద్రోణి చురుగ్గా ఉన్న సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని.. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
పంటల విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే వర్షంతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడ వద్దని ప్రజలను కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కిడ్నాపైన విద్యార్థి సురక్షితం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం
For More TG News And Telugu News