తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:34 PM
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారీ హోర్డింగులు, పెద్ద వృక్షాల వద్ద నిలబడవద్దని ప్రజలకు సూచించింది. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుము మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది.
అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ
For More Telangana News And Telugu News