నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఐదు రోజుల పాటు ఎండలే ఎండలు..
ABN , Publish Date - May 19 , 2026 | 04:10 PM
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఈ రోజు (మంగళవారం) రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో నేడు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో బుధవారం నాడు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటివి ఎక్కువగా తాగాలన్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
దారుణం.. భార్యపై కత్తితో దాడి చేసి చంపేసిన భర్త
పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు