Share News

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

ABN , Publish Date - May 19 , 2026 | 02:25 PM

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..
Fire Accident

మేడ్చల్-మల్కాజ్‌గిరి: మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారా, లేరా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక సూచనలు

సెలెక్టివ్‌ ఆగ్రహమా?.. మీడియాపై వ్యూహాత్మక ఒత్తిడా.?


Updated Date - May 19 , 2026 | 02:33 PM