ఏపీ వాసులకు అలర్ట్.. మరో 3 గంటల్లో భారీ వర్ష సూచన
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:01 PM
ఏపీ వాసులకు మరో కీలక అలర్ట్ జారీ అయింది. ఇవాళ(శనివారం) మరో మూడు గంటల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి, మార్చి21: ఇటీవల రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు అదరగొడుతుంటే.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ వాసులకు మరో కీలక అలర్ట్(Rain Alert)జారీ అయింది. ఇవాళ(శనివారం) మరో మూడు గంటల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశముంది. ఈ కారణంగా చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. స్థానిక అధికారులు ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
మత్స్యకారుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు నేను ఎప్పుడూ చేయలేదు: ఎంపీ బీద మస్తాన్ రావు
గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతంటే.?