Share News

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ABN , Publish Date - Mar 18 , 2026 | 07:51 AM

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు అటు రైతులను, ఇటు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Heavy Rain Alert Telugu States

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు అటు రైతులను, ఇటు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది


తెలంగాణలో నిన్న అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకపూల్, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుము, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ రోజు బుధవారం రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వేళలో ఈదరుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద నిలబడకూడదని అధికారులు సూచించారు.


ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని స్పష్టం చేసింది. కాగా, రాయలసీమలో పలు జిల్లాల్లో అకాశం మబ్బులు కమ్మేయగా, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధాన్యం విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 08:09 AM