Share News

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:01 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్టులు జారీ చేసింది.

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..
AP Weather Alert

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్టులు జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది ఏపీఎస్డీఎంఏ. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.


ముఖ్యంగా మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, ఎస్‌.కోట, కొత్తవలస, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


మరోవైపు, పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఆ సంస్థ అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు వంటి వాటి కింద ఆశ్రయం పొందకుండా సురక్షిత భవనాల్లో ఉండాలని పేర్కొన్నారు. రైతులు, కూలీలు, ప్రయాణికులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Updated Date - Aug 10 , 2026 | 05:20 PM