Share News

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షాలు..

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:08 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షాలు..
AP Weather Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా నర్సీపట్నం, తుని, అన్నవరం, ఎలమంచిలి, కోటనందూరు, కోటవురట్ల, ఏటికొప్పాక, రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద, హోర్డింగ్స్‌ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది. వర్షం, గాలుల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని స్పష్టం చేసింది.


మరోవైపు, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తేల్చి చెప్పింది. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..

Updated Date - Sep 10 , 2026 | 03:15 PM