ఏపీలో బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనించే అవకాశముందని వెల్లడించారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని మూర్తి వెల్లడించారు. ముఖ్యంగా ఇవాళ (గురువారం) ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవనున్నట్లు తెలిపారు. శుక్ర, శనివారాల్లోనూ ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని మూర్తి చెప్పారు. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు, సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సూచించారు. మూడు రోజుల పాటు సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని మూర్తి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..
పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ.. ఏకంగా రూ.75 లక్షల సొత్తు స్వాహా..