Share News

ఏపీలో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు.. ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:02 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.

ఏపీలో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు.. ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక
AP Rain Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. అలాగే మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రఖర్ జైన్. వర్షాల సమయంలో వాగులు, కాలువలు, కాజ్‌వేలు పొంగిపొర్లే అవకాశముందని చెప్పారు. అలాంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోతున్న వైసీపీ

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. ఏజెంట్‌పై పీడీ యాక్ట్ నమోదు

Updated Date - Nov 05 , 2026 | 06:07 PM