Share News

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:08 PM

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

 ఏపీలో పిడుగుల హెచ్చరిక..  ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
Andhra Pradesh rain alert

అమరావతి, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంస్థ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.


రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 23 నాటికి రుతుపవనాల పురోగతి ఉంటుందని అంచనా వాతావరణ శాఖ వేసింది. మరోవైపు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ స్పందిస్తూ.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగుపాటు ముప్పు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్, బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి:

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేష్

రైతులను ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు.. డీలర్లకు మంత్రి అచ్చెన్న వార్నింగ్

Updated Date - Jun 22 , 2026 | 05:17 PM