Share News

ఏపీ ప్రజలకు అలర్ట్.. ముంచుకొస్తున్న తుఫాన్..

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:14 PM

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సుస్పష్టమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం రాత్రిలోపు అదే ప్రాంతంలో వాయుగుండంగా, రేపు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ముంచుకొస్తున్న తుఫాన్..
Weather Report

అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సుస్పష్టమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈరోజు (శనివారం) రాత్రిలోపు అదే ప్రాంతంలో వాయుగుండంగా, రేపు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నట్లు ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరనుందని ఆయన తెలిపారు.


తుఫాన్ ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు, అలాగే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. అత్యవసర సహాయం, తుఫాన్ వివరాల కోసం ఎస్డీఎంఏ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత..

అమెరికాలో కనిపించిన యూఎఫ్ఓ.. తాజా నివేదికలో సంచలన విషయాలు

Updated Date - Oct 24 , 2026 | 12:34 PM