ఢిల్లీలో పార్క్ చేసిన కారులో మృతదేహాలు
ABN, Publish Date - Feb 08 , 2026 | 09:48 PM
ఢిల్లీలోని ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 08: నగరంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, శివ నారాయణలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..
Updated at - Feb 08 , 2026 | 09:50 PM