Telangana: ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్..
ABN, Publish Date - Jan 09 , 2026 | 11:46 AM
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి 3రోజులు సింగిల్ స్క్రీన్స్‌పై ..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి 3రోజులు సింగిల్ స్క్రీన్స్‌పై రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.132 పెంపునకు ఓకే చెప్పింది. ఆ తరువాత వారం రోజులు సింగిల్ స్క్రీన్స్‌పై రూ.62, మల్టీప్లెక్స్‌లో రూ.89 పెంపునకు అంగీకరించింది. అయితే, పెరిగిన ఆదాయంలో 20శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని షరతు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Updated at - Jan 09 , 2026 | 11:46 AM