ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

ABN, Publish Date - Apr 26 , 2026 | 11:10 AM

టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు శనివారం శుభం కార్డు పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉప సంఘంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం జరిపిన చర్చలు శనివారం సఫలం అయ్యాయి. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కార్మికులకు 11% ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే విషయంపై అధికారులు, కార్మిక సంఘాలతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Updated at - Apr 26 , 2026 | 11:14 AM