తిరుపతిలో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలు అరెస్ట్
ABN, Publish Date - Jan 09 , 2026 | 01:57 PM
వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర లిఖించారు. జంతు బలులుచేసి.. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మేకపోతు మెడనరికి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో తిరుపతిలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. తిరుపతి నగరం కట్టకిందపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బంధువు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆయన స్నేహితుడు, ప్రైవేటు ఉద్యోగి అయిన భువన్‌కుమార్ కలిసి జగన్ జన్మదినం సందర్భంగా గత నెల 21న జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ ఎదుట కోడిని కోసి, కోడి రక్తంతో ఫ్లెక్సీలో జగన్, అభినయ్‌రెడ్డి ఫొటోలకు రక్తాభిషేకం చేశారు.
ఇవి చదవండి
జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కషత్వం: మంత్రి ఆనం
పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..
Updated at - Jan 09 , 2026 | 01:57 PM