జగన్ కొత్త నాటకం.. అసలు ఆ యాప్‌లో ఏముంది..!?
ABN, Publish Date - Jul 17 , 2026 | 07:27 AM
తన పార్టీలో తన జెండా కింద.. తన అజెండా అమలు చేసేలా జగన్ 2.O అనే యాప్‌ని తీర్చిదిద్దారు పులివెందుల ఎమ్మెల్యే. పార్టీగా బలపడదాం.. కానీ, నేను మీతో కలవను. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను చీల్చి చెండాడుదాం.. కానీ..
తన పార్టీలో తన జెండా కింద.. తన అజెండా అమలు చేసేలా జగన్ 2.O అనే యాప్‌ని తీర్చిదిద్దారు పులివెందుల ఎమ్మెల్యే. పార్టీగా బలపడదాం.. కానీ, నేను మీతో కలవను. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను చీల్చి చెండాడుదాం.. కానీ, నేను మీకు టైమ్ కేటాయించను. ప్రతి కార్యకర్త నిర్భయంగా తమ అభిప్రాయం చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది.. నేను మాత్రం మీ అభిప్రాయం పట్టించుకోను. చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా అనుసంధానం అవుతుంది.. కానీ, నేను మాత్రం ఎవరికీ అనుసంధానం అవ్వను. ఇదీ వైసీపీ అధినేత జగన్ మోనార్కిజం. ఆయన గురించి తెలిసిన వారెవ్వరూ ఈ అభిప్రాయం గురించి విభేదించరు. సడన్‌గా ఈ కొత్త డ్రామా ఏంటి? కూటమి ప్రభుత్వంపై, ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మే సరికొత్త అస్త్రమా? లేదంటే సొంత కేడర్ కౌంట్ కోసమా? లీడర్లు జారి పోకుండా ఉండేందుకు ఇదో డ్రామానా? పూర్తి వివరాలు కోసం వీడియో చూసేయండి..
Updated at - Jul 17 , 2026 | 07:29 AM