బరితెగించిన వైసీపీ నేతలు..ఓటర్ల స్లిప్పులు లాక్కుని..వీఆర్వోపై దాడి
ABN, Publish Date - Nov 28 , 2026 | 11:13 AM
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కుర్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కుర్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్లకు నేరుగా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వీఆర్వో నీలయ్యపై వైసీపీ నేత కుర్లి శివారెడ్డితోపాటు అతని అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఓటర్ స్లిప్పులు తమకే ఇవ్వాలని బెదిరించడమే కాకుండా, వీఆర్వో సెల్ఫోన్, స్లిప్పులను లాక్కొని అసభ్య పదజాలంతో దూషించారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని తలుపుల పోలీసులకు వీఆర్వో నీలయ్య ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శివారెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated at - Nov 28 , 2026 | 11:18 AM