ముక్కా శ్రావణి vs వరుదు కళ్యాణి.. విశాఖ మేయర్ పీఠం ఎవరిది?

ABN, Publish Date - Oct 27 , 2026 | 02:57 PM

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కూటమి, వైసీపీ మధ్య తీవ్ర మైండ్ గేమ్ నడుస్తోంది. కూటమి తరపున డాక్టర్ ముక్కా శ్రావణి బరిలో ఉండగా, వైసీపీ తరపున ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సవాలు విసురుతున్నారు.

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి, వైసీపీ మధ్య రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇరు పక్షాలు.. తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కూటమి తరఫున డాక్టర్‌ ముక్కా శ్రావణి, వైసీపీ తరఫున ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పోటీలో నిలిచారు. కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణికి మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నగర అభివృద్ధి, పెండింగ్‌ పనుల పూర్తి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రధాన అంశాలుగా ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి కూడా తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


ఈ పోటీలో కార్పొరేటర్ల మద్దతు, పార్టీల మధ్య సమన్వయం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారనున్నాయి. మేయర్‌ పదవికి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ కూటమి, వైసీపీ మధ్యే ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో విశాఖ మేయర్‌ పీఠం ఎవరిని వరిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 27 , 2026 | 03:11 PM