నేటితో విశాఖ విమానాశ్రయం సేవలు బంద్..

ABN, Publish Date - Aug 16 , 2026 | 08:38 PM

దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది.

దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది. ఒకప్పుడు చిన్న రన్ వే, కేవలం ఒక్క విమానంతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్.. కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయి సర్వీసులు అందించే స్థాయికి ఎదిగింది. నిత్యం విమానాల మోతతో, ప్రయాణికుల రాకపోకలతో, హడావుడితో కిటకిటలాడే ఈ ప్రాంగణంలో ఇకపై పౌర విమానాల శబ్దం, ప్రయాణికుల అలికిడి వినిపించవు..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 16 , 2026 | 08:38 PM