స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నేత ఖాతాల్లో కోట్లు

ABN, Publish Date - Oct 15 , 2026 | 09:35 PM

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. కదిరి నియోజకవర్గంలోని తలపుల వైసీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు బ్యాంకు ఖాతాలోకి కోట్ల రూపాయిల నగదు జమ కావడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. కదిరి నియోజకవర్గంలోని తలపుల వైసీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు బ్యాంకు ఖాతాలోకి కోట్ల రూపాయిల నగదు జమ కావడం స్థానికంగా కలకలం రేపింది. డీకే బాబుతోపాటు మరో నలుగురికి చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్‌లోకి రూ. 4 కోట్ల విదేశీ కరెన్సీ నగదు జమ అయింది. దీనిని పోలీసుల దృష్టికి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. దీంత వారి ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు పోలీసులు ఆదేశించారు. దీంతో వారి ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి.

Updated at - Oct 15 , 2026 | 09:42 PM