జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు

ABN, Publish Date - Apr 23 , 2026 | 12:24 PM

పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

కడప, ఏప్రిల్ 23: పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. ఇద్దరు ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకులతో పాటు రాజంపేట మండలం బోయినపల్లిలోని వేంకటేశ్వర ఆలయ సిబ్బంది ఏప్రిల్ 21న(మంగళవారం) పులివెందులలోని జగన్ నివాసానికి వెళ్లారు. టీటీడీ పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Updated at - Apr 23 , 2026 | 12:25 PM