తప్పని తెలీదు .. క్షమించండి..
ABN, Publish Date - Jan 30 , 2026 | 12:05 PM
తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక జంట ఫొటోషూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో చేసిన జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ జంట క్షమాపణ కోరుతూ వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: తిరుమలలో బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ జంట.. గొల్ల మంటపానికి అతి సమీపంలో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ జంటపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొత్త జంట క్షమాపణలు కోరుతూ వివరణ ఇచ్చింది. తిరుమల కళ్యాణ వేదికలో మా వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆలయం వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకున్నాం. ఆ వీడియోలు, ఫొటోలు డిలీట్ చేస్తున్నాం. తెలియక చేసిన తప్పును క్షమించాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
దానం నాగేందర్ పోటీ చేసినదానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది
శామీర్‌పేట్ లో భారీ చోరీ.. 20 తులాల బంగారం మాయం
Updated at - Jan 30 , 2026 | 03:35 PM