కేరళం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్

ABN, Publish Date - May 18 , 2026 | 07:58 AM

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అందుకోసం ఆదివారం రాత్రి ఆయన కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.00 గంటలకు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ తదితర నేతలు హాజరుకానున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఉన్నత విద్య లో కీలక మార్పు..అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్

భగ్గుమంటున్న ఎండలు ..పెరగనున్న వడగాల్పులు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 18 , 2026 | 08:02 AM