తమిళనాడులో విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గిస్తూ సీఎం విజయ్ ఉత్తర్వులు

ABN, Publish Date - Oct 25 , 2026 | 09:54 AM

తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంపై భారీగా వ్యాట్‌ను తగ్గించింది.

తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంపై భారీగా వ్యాట్‌ను తగ్గించింది. రాష్ట్రంలో విమాన ఇంధనంపై వ్యాట్ 29 శాతంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వ్యాట్ అధికంగా ఉండటంతో టికెట్ ధరలను పౌర విమానయాన సంస్థ పెంచాల్సి వస్తోంది. దీంతో ఇంధనంపై వ్యాట్ తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా సంస్థలు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు వచ్చే నెల నవంబర్ 1 నుంచి 2027 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.

Updated at - Oct 25 , 2026 | 10:09 AM