నామినేషన్ల గడువు పొడిగించడానికి నిరాకరించిన సుప్రీం

ABN, Publish Date - Oct 21 , 2026 | 04:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలంటూ వైసీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మంగళవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నామినేషన్ల గడువు మొత్తంగా వాయిదాకు, పొడిగింపునకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలంటూ వైసీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మంగళవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నామినేషన్ల గడువు మొత్తంగా వాయిదాకు, పొడిగింపునకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఫిర్యాదు చేసిన చోట పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated at - Oct 21 , 2026 | 04:22 PM