వంట గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు

ABN, Publish Date - Mar 13 , 2026 | 05:55 PM

సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో, గ్యాస్ ఏజెన్సీల ముందు సామాన్యులు గంటల తరబడి క్యూ కడుతున్నారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియాలో ఆయిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రతరం అయింది. గ్యాస్ కొరత కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో, గ్యాస్ ఏజెన్సీల ముందు సామాన్యులు గంటల తరబడి క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్స్ పనిచేయకపోవడం, ఒకవేళ బుక్ చేసినా డెలివరీకి వారం రోజులకు పైగా సమయం పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఇవి చదవండి

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

చికెన్ ముక్క కోసం యాక్టింగ్ ఇరగదీసిన కుక్క.. ట్విస్ట్ మామూలుగా లేదు..

Updated at - Mar 13 , 2026 | 05:58 PM