తుప్పు పట్టిన పాత ట్రాక్టర్.. ధర అక్షరాల రూ. 1.25 కోట్లు!

ABN, Publish Date - Feb 23 , 2026 | 08:08 AM

ట్రాక్టర్ పాడైపోవడంతో దానిని దశాబ్దాలుగా అలానే వదిలేశారు. తుప్పుపట్టిపోయి ఉన్న ఆ పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఏకంగా రూ. 1.25 కోట్లు తెచ్చిపెట్టింది.

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 23: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో దశాబ్దాలుగా మూలన పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడు అది సామాన్యమైన వాహనం కాదని గుర్తించాడు.

ట్రాక్టర్ ప్రత్యేకతలు:

సదరు ట్రాక్టర్ 1920 బ్రిటిష్ కాలం నాటి అత్యంత అరుదైన మోడల్. ఆవిరితో (Steam) నడిచే ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఇలాంటి వింటేజ్ ట్రాక్టర్లు ప్రస్తుతం ప్రపంచంలోనే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీని చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించిన సదరు విదేశీయుడు ఏకంగా రూ. 1.25 కోట్లు చెల్లించి దీనిని కొనుగోలు చేశాడు. 'Old is Gold' అనే సామెతను నిజం చేస్తూ, ఒక పాత వస్తువు ఎలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో ఈ వీడియోలో చూడవచ్చు.


ఈ వార్తలూ చదవండి:

కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్‌పై పిడిగుద్దులు

వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..

Updated at - Feb 23 , 2026 | 10:41 AM