గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ర్యాలీ

ABN, Publish Date - Nov 14 , 2026 | 12:25 PM

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. శిల్పారామం / శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ (హైటెక్ సిటీ) వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. వాహనదారుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించారు. రాహుల్ గాంధీతో పాటు ఈ ర్యాలీలో గిగ్ వర్కర్లకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ముందు వరుసలో మహిళా గిగ్ వర్కర్స్ కోసం వాహనాలను ఏర్పాటు చేశారు.

Updated at - Nov 14 , 2026 | 12:33 PM