సుప్రీంకోర్టు దిశగా రాహుల్, ప్రియాంక గాంధీ మార్చ్.. వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు
ABN, Publish Date - Oct 12 , 2026 | 04:53 PM
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ, అక్టోబర్ 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. నేహా బోరాతో కలిసి సుప్రీంకోర్టు దిశగా మార్చ్ చేపట్టారు. వీరికి మద్దతుగా వేలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. దీంతో దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. కనాట్ ప్లేస్ నుంచి మండీ హౌస్ వరకు రహదారులపై పెద్ద సంఖ్యలో నిరసనకారులు కనిపించారు. ఈ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశంతో ఈ మార్చ్ కొనసాగుతోంది.
Updated at - Oct 12 , 2026 | 04:59 PM