విధిని ఎదిరించి విజయం వైపు.. వీల్‌ ఛైర్ నుంచి ఎవరెస్ట్ దాకా..

ABN, Publish Date - Mar 10 , 2026 | 11:21 AM

వీల్‌ ఛైర్‌కు పరిమితం కావాల్సిన పరిస్థితిని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న ఓ వ్యక్తి.. తన దృఢ సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సిద్ధమవుతూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి పరిమితులనైనా అధిగమించే మానసిక దృఢత్వమే విజేతలకు ఉండే గొప్ప లక్షణం. సామాన్యులను అసామాన్యులుగా మార్చే శక్తి ఇదే. 66 ఏళ్ల వయసు.. ఒక కాలు పూర్తిగా సహకరించని స్థితి.. వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి.. అయినా సరే, అవేవీ రావి రమేష్ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. వీల్ చైర్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ఆయన చేసిన ప్రయాణం అసాధారణం. ఇప్పుడు ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఓటమిని ఓడించిన ఆయన విజయగాథ.. అలుపెరుగని పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం.. మనం చెప్పుకోబోతున్న కృష్ణా జిల్లాకు చెందిన రావి రమేశ్ బాబు కూడా ఇలాంటి విజేతల్లో ఒకరు. జీవితాంతం వీల్ ఛైర్‌కు పరిమితం కావాల్సిన స్థితిని అధిగమించిన ఆయన ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌‌‌ను చేరగలిగారు. మోకాళ్లు, వెన్నెముక సర్జరీలతో కదల్లేని దుర్భర స్థితిని జయించి ఇప్పుడు కశ్మీర్ టూ కన్యాకుమారి సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు.


తాజాగా.. ఆయన్ను ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

ఢిల్లీ మద్యం స్కాం రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

Updated at - Mar 10 , 2026 | 03:20 PM