ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డ్
ABN, Publish Date - Jun 10 , 2026 | 08:57 AM
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక 1952 మే 13న ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న మరణించేదాకా 4,398 రోజులపాటు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెసేతర పార్టీ తరఫున రెండు సార్లు పూర్తికాలపు ప్రధానిగా (పదేళ్లు) పనిచేసి రికార్డు సాధించిన మోదీ.. ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు.
ఇవి కూడా చదవండి
బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్ కట్టె పొంగలి.. తయారీ విధానం ఇలా
ఈ కోతి ఏంటీ ఇలా చేసింది.. కుక్కపిల్లను చెట్టుపైకి ఎత్తుకెళ్లి మరీ..
Updated at - Jun 10 , 2026 | 08:57 AM