పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లుల ఆమోదానికి కసరత్తు..

ABN, Publish Date - Jul 19 , 2026 | 05:13 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలు చేపట్టనుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లో చర్చించి, ఆమోదం తెలపనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 19 , 2026 | 05:13 PM