బుద్దుందా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా?

ABN, Publish Date - Feb 20 , 2026 | 10:30 AM

ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం పరిస్థితులు నెలకున్నాయి. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత అధికార, విపక్ష సభ్యుల మాటల యుద్ధం చోటు చేసుకుంది.

అమరావతి, ఫిబ్రవరి 20: ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం పరిస్థితులు నెలకున్నాయి. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత అధికార, విపక్ష సభ్యుల మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇందాపూర్‌ డెయిరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. అదే సమయంలో సభలోని వైసీపీ సభ్యులు గోవిందా.. గోవిందా.. అంటూ నినాదాలు హోరెత్తించారు. సభలో సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఆయన తన ఇయర్ ఫోన్స్ విసిరికొట్టారు. వైసీపీ సభ్యులకు బుద్ధి లేదంటూ మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం, భక్తి లేవని స్పష్టం చేశారు.


దేవుని ఫొటోలతో సభలో రచ్చ చేయడం సరికాదంటూ విపక్ష సభ్యులకు ఆర్థిక మంత్రి పయ్యావుల హితవు పలికారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా? అంటూ వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. వైసీపీవి దుర్మార్గ చర్యలంటూ ఆయన అభివర్ణించారు. హిందువులను వైసీపీ రెచ్చగొడుతోందని విమర్శించారు. చరిత్రలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలను సభకు తేవడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆందోళనల మధ్య శాసనమండలిని 10 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం..!

తుది దశకు ఎమ్మెల్యేల ఫిరాయింపు పంచాయితీ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 20 , 2026 | 10:47 AM