హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్
ABN, Publish Date - Jan 10 , 2026 | 04:59 PM
పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 65 వేల వాహనాలు టోల్‌ప్లాజాను దాటాయి.
హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి సెలవుల(Sankranti Holidays) నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. గ్రామాలకు వెళ్లేందుకు నగర వాసులు భారీగా బయలుదేరడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు సహా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 65 వేల వాహనాలు టోల్‌ప్లాజాను దాటాయి. కాగా నేడు రద్దీ మరింత పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 10 , 2026 | 05:11 PM