మమతా బెనర్జీపై మహిళ దాడి..
ABN, Publish Date - Oct 14 , 2026 | 09:36 AM
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ మహిళ కత్తితో మమతా బెనర్జీపై దాడికి యత్నించినట్లు టీఎంసీ ఆరోపించింది.
పశ్చిమబెంగాల్, అక్టోబర్ 14: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ మహిళ కత్తితో మమతా బెనర్జీపై దాడికి యత్నించినట్లు టీఎంసీ ఆరోపించింది. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ కార్యకర్తలు సదరు మహిళను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. కోల్కత్తాలోని మమతా నివాసం కాళీఘాట్లో ఈ ఘటన జరిగిందని టీఎంసీ నేతలు తెలిపారు. ఈ ఘటనతో మమతా బెనర్జీ భద్రతపై టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది.
Updated at - Oct 14 , 2026 | 09:36 AM