వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ABN, Publish Date - Feb 15 , 2026 | 08:13 AM

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

వేములవాడలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా మహా శివరాత్రి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ శివరాత్రికి మొదటిసారిగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం.


ఈ వీడియోలు చూడండి:

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు..

Updated at - Feb 15 , 2026 | 08:36 AM