కర్నూలులో మంత్రాలు.. అమెరికాలో ఎంగేజ్‌మెంట్..
ABN, Publish Date - Jul 11 , 2026 | 09:55 AM
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్‌లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్‌లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా టి. గోవిందు స్వామి, శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పని చేస్తున్నారు. తిరుపతికి చెందిన కుమార్‌బాబు, శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ అమెరికాలోనే సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో అంగీకరించారు. అమెరికా నుంచి రావడానికి వీసా సమస్యలు ఉన్నందు వల్ల ఆన్‌లైన్‌లో నిశ్చిత్తార్థం చేశారు.
ఇవి చదవండి
ఒప్పందం ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలు.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక..
ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!
Updated at - Jul 11 , 2026 | 09:56 AM