పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్
ABN, Publish Date - Jul 27 , 2026 | 04:29 PM
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ను సందర్శించారు.
సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ను సందర్శించారు. పెద్దిరెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. యశోదా ఆస్పత్రి వైద్యులు ప్రస్తుతం సుదర్శన్ రెడ్డిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 27 , 2026 | 05:02 PM