కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులు వెళ్లే రూట్స్ ఇవే.!

ABN, Publish Date - Aug 18 , 2026 | 06:26 PM

హైదరాబాద్ మహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటి నుంచి ‘వన్‌ వే’ అమలైంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

హైదరాబాద్ మహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటి నుంచి ‘వన్‌ వే’ అమలైంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ట్రాఫిక్‌ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణ తీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్‌ పాయింట్స్‌, లైన్‌ చేంజింగ్‌‌పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను పరిగణలోకి తీసుకొని, సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 18 , 2026 | 06:26 PM