వేట్లపాలెం ఘటనలో బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్..
ABN, Publish Date - Mar 01 , 2026 | 03:57 PM
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, షాపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెం గ్రామ శివార్లలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రమాద సమయంలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు పై వీడియోను వీక్షించండి.
Updated at - Mar 01 , 2026 | 03:57 PM