కబ్జానేతకు జగన్‌ అండ!.. బొల్లా కుమారుడికి ఫోన్‌లో అభయం

ABN, Publish Date - Jun 09 , 2026 | 11:29 AM

ఫోర్జరీ డాక్యుమెంట్లతో రికార్డులు సృష్టించి హైదరాబాద్‌ గండిపేట వద్ద ఏకంగా రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో రికార్డులు సృష్టించి హైదరాబాద్‌ గండిపేట వద్ద ఏకంగా రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. బొల్లా కుమారుడు గిరిబాబుకు ఫోన్‌ చేసి అభయమిచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఈ కేసులో బ్రహ్మనాయుడుకు ఏమీ కాకుండా అందరమూ ఉన్నామంటూ జగన్‌ హామీ ఇచ్చారు. గిరిబాబుతో జగన్‌ ఫోన్‌లో మాట్లాడిన మాటలు యథాతథంగా సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యాయి.


ఇవి కూడా చదవండి

ట్రై సిరీస్: నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్

Updated at - Jun 09 , 2026 | 11:29 AM