జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: విజయసాయి రెడ్డి

ABN, Publish Date - Sep 30 , 2026 | 12:04 PM

అమరావతిని తాను వ్యతిరేకించడం లేదని.. రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమని విజయసాయిరెడ్డి అన్నారు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: అమరావతిని తాను వ్యతిరేకించడం లేదని.. రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. అన్ని కులమతాల రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ మాట తప్పిందని.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ యూటర్న్ తీసుకుని ఇప్పుడు మావిగన్ అంటున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated at - Sep 30 , 2026 | 12:09 PM